అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి... ఆర్థిక భరోసానిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ మేరకు అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో 77 మంది లబ్ధిదారులకు రూ.32,89,500 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మొత్తాలు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్ - తూర్పుగోదావరి జిల్లా తాజా సమాచారం
అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో 77 మంది లబ్ధిదారులకు రూ.32,89,500 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పినిపే విశ్వరూప్ అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలున్న వారి వైద్యానికి అయ్యే ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధిత కుటుంబాలకు అందిస్తామన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్