భూ యజమానులకు ఇబ్బందిలేకుండా కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. త్వరలోనే కామన్ డాక్యుమెంట్ విధానం అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. విధివిధానాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం అమలైతే కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏడాదిపాటు కామన్ డాక్యుమెంట్ నిబంధనలు వర్తించేలా రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు.
కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం - minister vishwaroop
కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక రూపొందిస్తున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం