తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతితో ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ చెప్పారు. దేవీపట్నం మండలం వీరవరంలో మంత్రితో పాటు ఎంపీ మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పర్యటించారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల నగదుతో పాటు.. నిత్యవసర సరకులు అందించారు. చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో పర్యటించి బాధితులకు సహాయం చేశారు. ధైర్యం చెప్పారు.