ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో... రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు పూజలు చేశారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ - east godavari district latest news
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని... మంత్రి వేణుగోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడాలని ప్రత్యేక పూజలు చేశారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు.. తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రాకార మండప పనులను మంత్రి పరిశీలించారు.
ఇదీచదవండి.