ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విలీన మండలాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటన - Minister Venugopalakrishna Latest News

విలీన మండలాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. కొవిడ్ టీకా వేసే కేంద్రాన్ని, ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా నిర్ధరణ అయితే వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు.

విలీన మండలాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటన
విలీన మండలాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటన

By

Published : May 12, 2021, 7:42 PM IST

మంత్రి వేణుగోపాలకృష్ణ విలీన మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొవిడ్ కేంద్రాన్ని సందర్శించారు. కొవిడ్ టీకా వేసే కేంద్రాన్ని, ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా మహమ్మారినీ తరిమికొట్టేందుకు స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించాలని సూచించారు.

కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్ష చేయించుకోవాలని.. నిర్థరణ అయితే వైద్యులు చెప్పిన విధానాలు పాటించాలని చెప్పారు. విలీన మండలాల్లో కరోనా నియంత్రణకు పటిష్టమై చర్యలు చేపట్టామని వివరించారు. చింతూరులోని ఓ కళాశాలలో, కూనవరంలో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details