తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం ఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వపరంగా సమగ్ర దర్యాప్తు చేసి...దోషులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్వామివారికి నూతన రథం త్వరలో నిర్మిస్తామన్నారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తదితరులు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.
నూతన రథం త్వరలో నిర్మిస్తాం: మంత్రి వేణుగోపాలకృష్ణ - అంతర్వేది తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ప్రాంతాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం కావడం బాధాకరమని ఆయన అన్నారు.
అంతర్వేదిలో రథం దగ్ధం ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ