తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు దర్శకుడు సుకుమార్... రాజోలు ఆసుపత్రిలో రూ.40 లక్షల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ఏర్పాటు చేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ ఆక్సిజన్ ప్లాంటును బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రాంతంపై ఉన్న మమకారంతో ఆక్సిజన్ కష్టాలు తీర్చిన దర్శకుడు సుకుమార్ అభినందనీయులన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకు రావాలని కోరారు.
'దర్శకుడు సుకుమార్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి' - new oxyzen plant inauguration at razole
ఆక్సిజన్ ప్లాంట్‌ను సమకూర్చిన దర్శకుడు సుకుమార్‌ను ఆదర్శంగా తీసుకుని పలువురు దాతలు ముందుకు రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ కోరారు. ఈ మేరకు దర్శకుడు సుకుమార్...ఆయన తండ్రి తిరుపతిరావు నాయుడు జ్ఞాపకార్థం నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను కలెక్టర్ మురళీధర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ
నూతన సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా నిమిషానికి 80 లీటర్ల సామర్థ్యంతో ఉత్పత్తి అయిన ప్రాణవాయువు నేరుగా పైపుల ద్వారా 20 పడకలకు అందుతుందన్నారు. మిగిలినది స్టోరేజ్ అవుతూ..ఫిల్లింగ్ కేంద్రానికి వెళ్తుందన్నారు. అనంతరం కొవిడ్ వార్డును పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: