ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్ - ఏపీ కరోనా కేసులు

రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కరోనా బారిన పడ్డారు.

మంత్రి వేణుగోపాలకృష్ణ
మంత్రి వేణుగోపాలకృష్ణ

By

Published : Sep 29, 2020, 4:38 AM IST

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సత్యవేడు ఎమ్మెల్యేకు..

కోనేటి ఆదిమూలం

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం ఆయనకు లక్షణాలు బయటపడగా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :'ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. పెద్దవాళ్లు ఒప్పుకోవటం లేదు'

ABOUT THE AUTHOR

...view details