రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలివ్వడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంటే ఓర్వలేకపోతురన్నారు.
'ఆవ భూముల్లో ఆవగింజంతైనా అవినీతి జరగలేదు' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
రాజమహేంద్రవరం ఆవ భూముల్లో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల పట్ల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ఆవభూముల్లో ఆవగింజంతైనా అవినీతి జరగలేదని మంత్రి అన్నారు.
!['ఆవ భూముల్లో ఆవగింజంతైనా అవినీతి జరగలేదు' Minister Venugopala Krishna comments chnadrababu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8512621-430-8512621-1598074076320.jpg)
మంత్రి వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం ఆవ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.... ఆవగింజంతైనా అవినీతి జరగలేదని మంత్రి అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు పట్ల సంతృప్తితో ఉన్నారని మంత్రి చెప్పారు. దేవీపట్నంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
ఇవీ చదవండి:వరవరరావు వైద్య నివేదికలు పరిశీలిస్తాం: ఎన్‌హెచ్‌ఆర్సీ