తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన రథనిర్మాణ పనులను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ , దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి గిరిజశేఖర్, కమిషనర్ అర్జునరావు పరిశీలించారు. వచ్చే ఏడాది స్వామివారి కల్యాణోత్సవాన్నికి నూతన రథం సర్వాంగ సుందరంగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. రథం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది కల్యాణోత్సవాన్నికి నూతన రథం: మంత్రి వేణు - తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం నిర్మాణం పనులను రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, దేవాదయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది స్వామివారి కల్యాణోత్సవాన్నికి నూతన రథం సర్వాంగ సుందరంగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
minister Venugopal Krishna