ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం' - ప్రతిపక్షాలపై మంత్రి తానేటి వనిత ఫైర్ వార్తలు

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని... రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు.

minister vanitha fire on opposition parties

By

Published : Nov 18, 2019, 12:02 AM IST

'ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం'

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని... మంత్రి తానేటి వనిత ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమంపై కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు మాట్లాడటానికి ఏమి లేకే... ఇసుక, ఆంగ్ల విధానంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details