ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తు తెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే.
కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలి పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు.