రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి ఇటీవల మరణించారు. ఆయన్ను పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా హసన్‌బాద్‌లో స్వగృహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతోపాటు, వైకాపా ఎమ్మెల్యేలు, కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జేసీలు, వైకాపా నాయకులు... ఎంపీ బోస్‌ను పరామర్శించారు. సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎంపీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రజాప్రతినిధులు, అధికారుల పరామర్శ - పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణీ మృతి
వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ ఇటీవల మరణించారు. మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు, అధికారులు..ఎంపీ స్వగృహానికి వచ్చి పరామర్శించారు.
ఎంపీ సుభాష్ చంద్రబోస్