తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు భూసేకరణపై.. మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సంయుక్త పాలనాధికారి లక్ష్మీసా, అమలాపురం సబ్‌కలెక్టర్ హిమాన్సు కౌశిక్, ఇతర అధికారులు హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి రైతులతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల భూమి అవసరం ఉంటుందని.. దీనికోసం రైతులతో మంత్రి మాట్లాడారు. భూమిని ఇచ్చేందుకు రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి వివరించారు. అమలాపురంలో 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుపైనా ఈ సమావేశంలో చర్చించారు.
వైద్య కళాశాలకు భూసేకరణపై మంత్రి విశ్వరూప్ సమావేశం - new medical college in Amalapuram
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైద్య కళాశాల నిర్మాణానికి కావాల్సిన స్థలం కోసం... మంత్రి విశ్వరూప్ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. 50 ఎకరాల స్థలం కావాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ స్థలం ఇచ్చేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
![వైద్య కళాశాలకు భూసేకరణపై మంత్రి విశ్వరూప్ సమావేశం Minister Pinipe Vishwaroop Reiew on New Medical college in Amalapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8846598-343-8846598-1600423178625.jpg)
వైద్య కళాశాలకు భూసేకరణపై మంత్రి విశ్వరూప్ సమావేశం