వైకాపా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రజలకు వివరిస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జగనన్న పాదయాత్ర చేపట్టారు. దారిపొడవునా ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు.
బండారులంకలో మంత్రి పినిపే విశ్వరూప్ పాదయాత్ర - తూర్పుగోదావరి జిల్లా వైకాపా పాదయాత్ర వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంకలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పాదయాత్ర చేశారు.
![బండారులంకలో మంత్రి పినిపే విశ్వరూప్ పాదయాత్ర బండారు లంకలో మంత్రి పినిపే విశ్వరూప్ పాదయాత్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9450188-691-9450188-1604645700660.jpg)
బండారు లంకలో మంత్రి పినిపే విశ్వరూప్ పాదయాత్ర