మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడి ఫొటోను శిలాఫలకంపై ముద్రించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలో ఓ రహదారి నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రం ముద్రించడం విస్మయానికి గురిచేసింది. శంకుస్థాపన అయ్యాక కాసేపటికి ఫొటోను గుర్తుపట్టకుండా చెరిపేశారు.
minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..! - రాజపూడిలో శిలాఫలకం వార్తలు
ఓ శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై మంత్రి ఫొటోకు బదులు..ఆయన తమ్ముడి ఫొటోను ముద్రించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలో జరిగింది.
minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!
Last Updated : Jul 17, 2021, 4:37 PM IST