ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంగ్ల మాధ్యమంపై చంద్రబాబు యూటర్న్​'

తెదేపా అధినేత చంద్రబాబు ఆంగ్ల మాధ్యమంపై యూటర్న్​ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గతంలో ఆంగ్లమాధ్యమంపై అనుకూలంగా మాట్లాడి... ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విమర్శలు

By

Published : Nov 22, 2019, 4:31 PM IST

Updated : Nov 22, 2019, 5:32 PM IST

పరిస్థితులను బట్టి మాటమార్చడం...యూటర్న్ తీసుకోవడం చంద్రబాబు స్వభావమని మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని పరిచయం చేయాలనుకున్నది తామేనని....అందుకు జగన్‌ అడ్డుకున్నారని గతంలో చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆంగ్లమాధ్యమాన్ని వద్దంటున్నది చంద్రబాబేనని పేర్ని నాని మండిపడ్డారు. ఎంపీ సుజనా పిల్లలు ఏ మాధ్యమంలో చదివారని ప్రశ్నించారు.

తెదేపా హయాంలో వేసిన పసుపు రంగు పవన్‌కు ఎందుకు కనిపించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఆలయ కమిటీల్లో సభ్యులుగా బీసీలకు అవకాశం ఇస్తే తప్పేంటన్నారు. ఎలక్ట్రికల్‌ బస్సుల టెండరును న్యాయపరిశీలనకు పంపామని... బస్సుల కొనుగోలు విషయంలో వెనక్కి వెళ్లలేదన్నారు.

చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విమర్శలు
Last Updated : Nov 22, 2019, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details