అతిథి మర్యాదలు వద్దు...సామాన్య భక్తుడినే: మంత్రి పేర్ని నాని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి పేర్ని నాని సాధారణ భక్తుడిలా వ్యవహరించారు. దేవస్థానం అధికారులతో స్వామి దర్శనానికి వచ్చిన తనను సామాన్య భక్తుడిగానే చూడాలని సూచించారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన అల్పాహారం ఖర్చులనూ చెల్లించారు. మంత్రికి బందోబస్తు ఏర్పాటు చేయటానికి వచ్చిన సీఐ, ఎస్సైలను.. మీకు చాలా పనులుంటాయి... మీ పనులు చూసుకోండని సున్నితంగా చెప్పారు. మంత్రి హోదాలో ఉండి సాధారణ భక్తుడిలా వ్యవహరించడంతో దేవస్థానం అధికారులు, పోలీసు అధికారులు మంత్రి నిరాడంబతను కొనియాడుతున్నారు.