తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ పరిధిలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు. జిల్లాలో వేల ఎకరాలు పంటలు నీటి మునిగాయని మంత్రి అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో ఎన్నడు చూడని వరదలు సంభవించాయని మంత్రి అన్నారు.
ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు : కన్నబాబు - ఏపీ వర్షాలు
గత పదేళ్లలో ఎన్నడు చూడని వరద సంభవించిందని మంత్రి కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని మంత్రి అన్నారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడ్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీఇచ్చారు.
Minister kannbabu
ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపడుతున్నామన్నారు. బాధితులకి ఆహారం, తాగునీరు అందిస్తున్నామన్నారు. గ్రామ వాలంటరీలు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కమిటీలు వేసి బాధితులకు సహాయ చర్యలు అందిస్తామని మంత్రి అన్నారు. అధికారులు సహాయచర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీరు తగ్గాక పంట నష్టాలు త్వరితగతిన అంచనా వేస్తామన్నారు. :
ఇదీ చదవండి :విజయవాడ వాసులకు దసరా కానుక...అందుబాటులో కనకదుర్గ ఫ్లైఓవర్