ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం, మోదీ భేటీలో ఏం జరిగిందో మీకెలా తెలుసు..?' - సీఎం జగన్ వార్తలు

పీఎం మోదీ, సీఎం జగన్​ల భేటీని తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే ఎలా మాట్లాడుతున్నారని మంత్రి ప్రశ్నించారు.

kanna babu
kanna babu

By

Published : Feb 13, 2020, 8:33 PM IST

తెదేపా నేతలపై మంత్రి కన్నబాబు విమర్శలు

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్ భేటీఅయ్యారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వీరివురి భేటీపై తెదేపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య మంచి సంబంధాలు ఉండకూడదని తెదేపా భావిస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించారు.'ముఖ్యమంత్రికి ప్రధాని చీవాట్లు పెట్టారని యనమల చెబుతారు. అక్కడ లోపల ఏం జరుగుతుందో మీకెలా తెలిసింది. ఆ సమయంలో మీరు కార్పెట్లు శుభ్రం చేశారా?, వారిద్దరూ తాగిన కాఫీ కప్పులు తీశారా?' అని మంత్రి ఎద్దేవా చేశారు. అంతే కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. తెదేపా నేతల తీరు చూస్తుంటే జాలి వేస్తుందని మంత్రి కన్నబాబు అన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details