కాకినాడ సెజ్ భూములపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి కన్నబాబు అన్నారు. రెండు వేల నూట ఏనభై ఎకరాలు తిరిగి రైతులకు ఇవ్వడం అభినందనీయమని కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పిఠాపురం సభలో రైతులకు హామీ ఇచ్చారని.. ఆ ప్రకారంగా సెజ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఇచ్చిన సిపార్సుల మేరకు కేబినెట్ ఈనెల 23న ఆమోదించడం జరిగిందన్నారు.
దీనితో పాటు సెజ్ భూముల పరిధిలోకి వచ్చిన ఆరు గ్రామాలను యధావిధిగా విడిచి పెట్టామని అన్నారు. 15 ఏళ్లుగా ఎంతో వివాదాస్పదంగా ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని.. ఆ గ్రామాలను పూర్తి అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు.