తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రమణయ్యపేటలో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర పాల్గొన్నారు. కాకినాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషిచేస్తానని కన్నబాబు అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు శుభకార్యాలు చేసుకునేందుకు నిర్వహణ రుసుము చెల్లించి వినియోగించుకునేలా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
కాకినాడలో సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి కన్నబాబు - minister kurasala kannababu news
కాకినాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పట్టణంలోని రమణయ్యపేటలో సామాజిక భవన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
![కాకినాడలో సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి కన్నబాబు Minister Kannababu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9540296-618-9540296-1605323086474.jpg)
సామాజిక భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి
కాకినాడలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు కాలువల్లో పూడిక తీతకు నిధులు మంజూరుచేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కన్నబాబు తెలిపారు. నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్న కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను మంత్రి అభినందించారు.
ఇదీ చదవండి: ప్రజాసంకల్ప యాత్రను స్మరించుకున్న రాజానగరం ఎమ్మెల్యే