దివీస్ ల్యాబ్ సంస్థ కారణంగా కోనసీమలో ఆక్వా పరిశ్రమ దెబ్బతింటోందని తెదేపా నేత యనమల మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. దివీస్‌ను వ్యతిరేకిస్తామని చెబుతున్న తెదేపా నేతలు గతం మర్చి పోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఆ సంస్థకు కోనసీమప్రాంతంలో భూ కేటాయింపులు జరిపింది తెదేపా ప్రభుత్వమేనని చెప్పారు. అనుమతులు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. తెదేపా హయాంలో మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు నిద్రపోయారో.. నిద్ర నటించారో తెలియటం లేదని ధ్వజమెత్తారు.
'తెదేపా నేతలు గతం మర్చిపోయినట్లున్నారు' - diwis pollution at east godavari latest news
దివీస్‌కు భూములు కేటాయించింది తెదేపా ప్రభుత్వమేనని.. దివీస్ ల్యాబ్ సంస్థ కారణంగా కోనసీమలో ఆక్వా పరిశ్రమ దెబ్బతింటోందని తెదేపా నేత యనమల అనడం విడ్డూరంగా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు.
minister kanna babu on diwis