ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏనాడైనా సన్నకారు రైతుల కోసం మాట్లాడారా?' - చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్ వార్తలు

రాష్ట్రంలోని పేద, సన్నకారు రైతుల సమస్యల గురించి తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ ఏనాడైనా మాట్లాడారా అని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ పై అనవసరపు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

minister kannababu
minister kannababu

By

Published : Oct 19, 2020, 11:04 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత లోకేశ్ పై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపించారు. అమరావతి రైతుల తరఫున తప్ప... ఏనాడైనా పేద, సన్నకారు రైతుల సమస్యలపై మాట్లాడారా..? అని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మీడియా అటెన్షన్​ కోసమే సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతేడాది పంట నష్టం కింద రూ.125 కోట్లు ఇన్​పుట్ సబ్సిడీ మంజూరు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో చెరకు రైతులకు బకాయిలు ఉన్న రూ. 55 కోట్లను సీఎం జగన్ చెల్లించారని చెప్పారు. వర్షాలకు, వరదలకు తేడా తెలియకుండా లోకేశ్ మాట్లాడుతున్నారని... ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details