ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుంటే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రతీ విషయంలో అడ్డుపడేందుకే ప్రయత్నిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు, అనుయాయుల పెట్టుబడులు పోతాయన్న బాధే ఆయనలో ఉందన్నారు. మంత్రి కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడారు. రాజధానులపై ప్రభుత్వం ఓ ప్రక్రియ చేపట్టిందని... దానికి విరుద్ధంగా ప్రజల్ని ప్రతిపక్షాలు మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. 29 గ్రామాల అభివృద్ధే చంద్రబాబుకు ముఖ్యమా? అని కన్నబాబు ప్రశ్నించారు.
'29 గ్రామాల అభివృద్ధే చంద్రబాబుకు ముఖ్యమా?' - కన్నబాబు లెటేస్ట్ కామెంట్స్
24 గంటలూ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి కన్నబాబు ఆరోపించారు. 29 గ్రామాల అభివృద్ధే ముఖ్యమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కన్నబాబు విమర్శించారు. రాజధాని ప్రాంతంలో తెదేపా నేతలు పెట్టిన పెట్టుబడులు పోతాయనే.. చంద్రబాబు బాధ తప్ప, రైతుల కోసం కాదని విమర్శించారు.
కన్నబాబు