ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీఎస్పీ బెటాలియన్ సేవలు భేష్: మంత్రి కన్నబాబు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని మూడవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ముఖ్య అతిథిగా మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థకు గౌరవం తీసుకొచ్చేలా అందరూ నడుచుకోవాలని మంత్రి సూచించారు.

minister kannababu attends apsp police Passing Out Parade
minister kannababu attends apsp police Passing Out Parade

By

Published : Sep 8, 2020, 11:47 PM IST

సాంకేతికంగా పోలీసు వ్యవస్థను మరింత పటిష్ట పర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మూడవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 119 మంది కానిస్టేబుళ్లల్లో విద్యావంతులు అధికంగా ఉన్నారని అన్నారు.

పోలీసు వ్యవస్థకు గౌరవం తీసుకొచ్చేలా అందరూ నడుచుకోవాలని సూచించారు. విపత్తుల సమయాల్లో ఏపీఎస్పీ బెటాలియన్‌ అందించిన సేవలను ప్రసంశించారు. శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్‌ మాట్లాడుతూ... పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని.. నిజాయితీతో రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కరోనా కష్టకాలంలో ఏపీఎస్పీ బెటాలియన్‌ అందించిన సేవలను కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details