తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో మంత్రి కన్నబాబు పర్యటించారు. ముంపునకు గురైన పంటలను మంత్రి కన్నబాబు పరిశీలించారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కన్నబాబు అన్నారు. పంట నీటమునిగి మొలకలు వచ్చాయన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వరదలతో నష్టపోయిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని... నష్టపోయిన కౌలురైతులకూ పరిహారం ఇస్తామని వెల్లడించారు. కౌలురైతులకు భూయాజమానులు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలి సూచించారు.
'వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం' - kanna babu visits east godavari
వరదతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
minister kanna babu visits flood effected area in east godavari