16 మంది ఆచూకీ తెలియాలి- మంత్రి కన్నబాబు - papikondalu boat accident
బోటు ప్రమాదానికి గురైనవారిలో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోని బాధితులను మంత్రి పరామర్శించారు.
బోటు ప్రమాద బాధితులపై మంత్రి కన్నబాబు
గోదావరి బోటు ప్రమాదానికి గురైనవారిలో ఇంకా 16 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని బాధితులను కన్నబాబు పరామర్శించారు. తొలత బోటు ప్రమాదంలో 73 మంది ఉన్నారని భావించామని... బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలుస్తోందన్నారు.16 మందిలో ఏపీకి చెందిన 9 మంది, తెలంగాణకు చెందిన ఏడుగురు ఉన్నారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. బోటు వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు