ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు సాయం: ధర్మాన

వరద సహాయక చర్యలతో పాటు అదనంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలు సాయం అందించాలని సీఎం ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. వరదలు తగ్గగానే నష్టంపై అంచనాకు బృందాలు పంపుతామని పేర్కొన్నారు.

ధర్మాన కృష్ణదాస్
ధర్మాన కృష్ణదాస్

By

Published : Aug 18, 2020, 5:36 PM IST

వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. గోదావరి వరద పరిస్థితిపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం నుంచి మంత్రి కృష్ణదాస్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

వరద సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఆ వెంటనే నష్టం అంచనా వేస్తామని మంత్రి చెప్పారు.

"వరద బాధితుల్ని ఆదుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఆ దిశగా పర్యటనలు చేస్తున్నాం. వరద అనంతరం తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాం."

-- ధర్మాన కృష్ణదాస్, ఉపముఖ్యమంత్రి

-

ఇదీ చదవండి:

శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్​లో మునిగిన ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details