ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వేణుగోపాలకృష్ణ - ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. . ఏ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా వైద్యానికి దూరం కాకూడదన్న ఉద్దేశ్యంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

Chelluboina Venugopalakrishna
Chelluboina Venugopalakrishna

By

Published : Aug 9, 2020, 5:29 PM IST

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో కరోనా బాధితులను మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పరిస్థితిని సమీక్షించానని చెప్పారు.

జైల్లో కరోనాతో బాధపడుతున్న ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నట్లు వివరించారు. ఏ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా వైద్యానికి దూరం కాకూడదన్న ఉద్దేశ్యంతో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్‌ కేసులు అధికమవుతున్న వేళ అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు.

జిల్లాలో 2.70 లక్షల మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 30 వేల మందికి పైగా కోవిడ్‌ బారిన పడ్డారని వివరించారు. ప్రస్తుతం 17 వేల మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

అబ్బో ఎంత పెద్ద పుట్టగొడుగో..మీరూ చూడండి

ABOUT THE AUTHOR

...view details