ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 25, 2020, 7:54 PM IST

ETV Bharat / state

'మంత్రి అప్పలరాజు తన వ్యాఖ్యలు వెనెక్కి తీసుకోవాలి'

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను బీసీ సంక్షేమ సంఘం ఖండించింది. మంత్రి తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలను అడ్డుకుంటామని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు అన్నారు.

gouthu lachanna
మంత్రి అప్పలరాజు తన వ్యాఖ్యలు వెనెక్కి తీసుకోవాలి

బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలను కూలుస్తామన్న రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తన మాటలు వెనక్కు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మట్టపర్తి సూర్యచంద్రరావు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని ఆర్ఎస్​బీసీ కన్వెన్షన్ హాల్లో గల సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలను తొలగిస్తామని మంత్రి చెప్పడమే దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

మంత్రి సిదిరి అప్పలరాజుపై సీఎం చర్యలు తీసుకోవాలని మట్టపర్తి సూర్యచంద్రరావు కోరారు. మంత్రి వ్యాఖ్యలు బీసీల ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలను అడ్డుకుంటామన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details