పోలవరంలో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ పర్యటించారు. నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం షెడ్యూల్ ప్రకారం పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డిజైన్లకు కేంద్రం అనుమతి రావాల్సి ఉందన్న మంత్రి... అనుమతి రాగానే ఎగువ కాపర్ డ్యామ్ మూసి నీటిని స్పిల్ వే మీదుగా మళ్లిస్తామని అన్నారు. మే 31 నాటికి పునరావాస కాలనీలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనీలు పూర్తయ్యాక 41వ కాంటూరు పరిధి గ్రామాలు ఖాళీ చేయిస్తామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
నిర్మాణ పనులు వేగవంతం చేయండి : అనిల్ కుమార్ - polavaram capar dam latest news
పోలవరం కాపర్ డ్యాం నిర్మాణ పనులను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్లకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉందన్న మంత్రి... అనుమతి రాగానే ఎగువ కాపర్ డ్యామ్ మూసి నీటిని స్పిల్ వే మీదుగా మళ్లిస్తామని అన్నారు.
![నిర్మాణ పనులు వేగవంతం చేయండి : అనిల్ కుమార్ minister anil kuamar yadav inspected polavaram capar dam works in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11044737-448-11044737-1615975299216.jpg)
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్