కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. మొత్తం విదేశాల నుంచి 13,301 మంది రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 2,222 మంది.. 20 రోజుల పరిశీలన పూర్తిచేసుకున్నారని తెలిపారు. ఒక వెయ్యి126 మంది హోమ్ ఐసొలేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. 56 మంది ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్న ఆయన...ఇంకా 22 కేసుల నమూనాలు రావాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా అప్డేట్స్ : ఆరుగురికి పాజిటివ్ - minister alla nani news
రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై బులెటిన్ విడుదల చేసింది. మొత్తం విదేశాల నుంచి వచ్చిన 13 వేల 301 మందిని గుర్తించినట్టు మంత్రి ఆళ్లనాని తెలిపారు. వారిలో 20 రోజుల పరిశీలన పూర్తిచేసుకున్న వారి సంఖ్య 2,222 మందిగా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్న ఆయన ఇంకా 22 కేసుల నమూనాలు రావల్సి ఉందని తెలిపారు.
![రాష్ట్రంలో కరోనా అప్డేట్స్ : ఆరుగురికి పాజిటివ్ minister alla nani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6514798-thumbnail-3x2-alla.jpg)
minister alla nani
రాష్టంలో కరోనా అప్డేట్స్ : ఆరుగురికి పాజిటివ్
ప్రజలంతా మార్చి 31 వరకు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. నిర్లక్ష్యం చేస్తే కరోనా వ్యాప్తికి మనమే కారణమవుతామన్నారు. వ్యక్తిగతంగా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. రైతు బజార్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇంకా వెంటిలేటర్లు అదనంగా కావాల్సి ఉందన్న మంత్రి... నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:తెలంగాణలో 30కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Mar 23, 2020, 4:32 PM IST