ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్ - కొవిడ్ తగ్గాక పది పరీక్షల నిర్వహణ వార్తలు

కొవిడ్ కేసులు తగ్గిన తర్వాత పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటిచారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ప్రధానమని మంత్రి వ్యాఖ్యానించారు.

కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్
కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్

By

Published : Jun 5, 2021, 1:49 PM IST

Updated : Jun 5, 2021, 2:27 PM IST

కొవిడ్ తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ అన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే చాలా ఇబ్బంది అని మంత్రి అభిప్రాయపడ్డారు. పరీక్షలు నిర్వహించవద్దని తల్లిదండ్రులు కోరుకోవడం లేదని అన్నారు. పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. 11 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్​తో కూడిన అంశమని, కొవిడ్ తగ్గాక నిర్ణయిస్తామని చెప్పారు. ఆర్​జేడీ పోస్టుల రద్దు అంశం వదంతులు మాత్రమే అని మంత్రి చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం మోరంపూడిలో ఎంపీ భరత్ రామ్ తో కలిసి మంత్రి సురేశ్ మొక్కలు నాటారు. ఇంటర్​లో కొత్త కళాశాలల అవసరాన్ని బట్టి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

Last Updated : Jun 5, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details