కొవిడ్ కేసులు వచ్చిన విద్యాసంస్థలు వెంటనే మూసేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ స్థితిగతులపై మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ మళ్లీ పుంజుకుంటోందని.. 2 నెలలు జాగ్రత్త అవసరమని మంత్రి అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని తెలిపారు. కరోనా సోకిన వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారాలు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
'కొవిడ్ కేసులు వెలుగుచూసిన విద్యాసంస్థలు మూసేయాలి' - corona cases in andhra pradesh updates
కొవిడ్ కేసులు వెలుగుచూసిన విద్యాసంస్థలు మూసేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
!['కొవిడ్ కేసులు వెలుగుచూసిన విద్యాసంస్థలు మూసేయాలి' minister adimulapu suresh on corona cases in educational institutions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11178339-626-11178339-1616827702917.jpg)
minister adimulapu suresh on corona cases in educational institutions
ఆంధ్రప్రదేశ్లోనే పూర్తిస్థాయిలో తరగతుల నిర్వహిస్తున్నామని మంత్రి సురేశ్ అన్నారు. చర్యలు తీసుకోవడంతో అకడమిక్ క్యాలెండర్ గాడిలో పెట్టామన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ గుర్తుచేశారు.
ఇదీ చదవండి: కనిష్ఠ స్థాయికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం