గోదావరి వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వ ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ భరోసా ఇచ్చారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్‌తో కలిసి ఆయన అమలాపురం రూరల్ మండలంలో జలదిగ్బంధంలో ఉన్న గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందజేస్తామన్నారు.
వరద బాధితులను ఆదుకుంటాం: మంత్రి పినిపే విశ్వరూప్ - అమలాపురంలో మంత్రి విశ్వరూప్ పర్యటన
వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని ముంపు గ్రామాల్లో పర్యటించారు.
అమలాపురం రూరల్ మండలంలో మంత్రి పినిపే విశ్వరూప్