ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెంలోని క్వారంటైన్​కు వలస కూలీలు

హైదరాబాద్ నుంచి జిల్లాకు చేరుకున్న వలస కూలీలను అధికారులు రావులపాలెంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు తరలించారు. వీరందరికీ కొవిడ్​ పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగిటివ్​ వస్తే ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

migrante labours shift to their own home towns
స్వగ్రామాలకు హైదరాబాద్​లో ఉన్న వలస కూలీలు

By

Published : May 17, 2020, 3:41 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వలస కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్​లోని పటాన్ చెరువులో ఉంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అక్కడ ఎలాంటి పనులు లేక పోవడంతో వీరంతా స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతమైన రావులపాలెం మండలం గోపాలపురంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. 80 మంది వలస కూలీలను జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ వచ్చిన వారందరినీ వారి గ్రామాలకు పంపిస్తామని సీఐ కృష్ణ, ఎస్.ఐ బుజ్జి బాబులు తెలిపారు.

ఇవీ చూడండి...'భవిష్యత్ అంతా ఆ వాహనాలదే'

ABOUT THE AUTHOR

...view details