ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊళ్లకు పంపాలని... కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వినతుల వెల్లువ - కాకినాడలో వలస కార్మికుల కష్టాలు

తమను స్వగ్రామాలకు పంపాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వలస కార్మికులు కోరుతున్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి నేడు వందల సంఖ్యలో కూలీలు వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఉపాధి కోసం వచ్చి నెలన్నరగా ఇక్కడే చిక్కుకుపోయామని ఆవేదన చెందారు. వీలైనంత త్వరగా స్వస్థలాలకు పంపాలని వేడుకుంటున్నారు.

migrant labours struck in east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో వలస కార్మికులు

By

Published : May 7, 2020, 5:04 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా గత నెలన్నరగా తూర్పుగోదావరి జిల్లాలో చిక్కుకున్న వివిధ ప్రాంతాల వలస కార్మికులు తమ స్వగ్రామాలకు పంపించాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. వారంతా కాకినాడలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. 656 మంది ఇతర జిల్లాల వారు, 1883 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది.

వీరుకాక పర్యటకులు, బంధువుల ఇళ్లకు వచ్చినవారు సుమారు 2వేల మంది ఉంటారని అంచనా వేశారు. ఇప్పటివరకూ 2,300 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీరిని స్వస్థలాలకు పంపేందుకు రాజమహేంద్రవరం నుంచి 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. విశాఖ నుంచి జిల్లా మీదుగా నడిచే రైళ్లలో బోగీలు కేటాయించాలని కోరినట్లు వివరించారు.

ఇవీ చదవండి.. చీకట్లో వలస కూలీల అవస్థలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details