బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలంటూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో మధ్యాహ్న భోజన పథకం సిబ్బందిని ఆదుకుంటామని హామీ ఇచ్చి.. ఇప్పటివరకు నెరవేర్చలేదని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేయడం వల్ల కొంత మంది సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారని వాపోయారు. వంట బిల్లులు, వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాకినాడలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా - కాకినాడలో మధ్యాహ్న భోజనం కార్మికుల నిరసన
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన చేపట్టారు. తమను ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చి.. నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వంట బిల్లులు, వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

midday meals workers protest at kakinada collector