తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని 16 మండలాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నూట నలభై ఐదు కోట్ల రూపాయల నిధులతో 28వేల 200 పనులు చేసేందుకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 70 శాతం పనులు వచ్చే నెల 20 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కోనసీమలో రూ.145 కోట్ల పనులకు అనుమతులు
ఈ ఆర్థిక సంవత్సరంలో కోనసీమలోని 16 మండలాల్లో 145 కోట్ల రూపాయలతో ఉపాధి పనులు చేపట్టేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు.
కోనసీమలో రూ.145 కోట్ల పనులకు అనుమతులు
చెరువులు, కాలువల్లో పూడిక తీత పనులు, నీటి కుంటలు ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యం కల్పించారు. ఈ పనులు ద్వారా కోనసీమలోని సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి కలుగుతుంది. కరోనా దృష్ట్యా ఉపాధి కూలీలు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:కోనసీమలో 365 రైతు భరోసా కేంద్రాలు