వరద నీటిలో విలీన మండలాలు - undefined
తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసిన మండలాలు ఇప్పుడు గోదావరి వరద నీటితో అల్లాతున్నాయి. వాగులు, వంకల్లోని నీరు గోదావరిలోకి చేరుతుండడంతో వరద ఉద్ధృతి పెరుగుతోంది.
వరద నీటిలో అల్లాడుతున్న విలీన మండలాలు
తూర్పుగోదావరి జిల్లాలో విలీన మండలాలైన కూనవరం, చింతూరు, వీఆర్ పురం ప్రస్తుతం గోదావరి వరద నీరుతో రహదారులన్నీ మునిగిపోయాయి. 26 గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పంట పొలాలు నీటి మునుగుతున్నాయి. ఈ మండలాల్లో ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంతకు ఒడిస్సా మోటూ నుంచి వచ్చే గిరిజనులు వరదలో చిక్కుకుపోవటంతో వారిని పడవల్లో తరలించారు.