ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యానాంలో మర్చంట్ అసోసియేషన్ ఉదారత

By

Published : Sep 22, 2020, 5:40 PM IST

యానాం కేంద్రపాలిత ప్రాంతంలో వ్యాపారస్థులు తమ ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. లక్షా 70వేలతో పెద్ద ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. కొవిడ్ కేంద్రంలో 200మందికి డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు.

యానాంలో
యానాంలో

యానాం కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో.. అక్కడి వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. 15 రోజుల పాటు దుకాణాలను మూసేస్తున్నారు. కొవిడ్ రోగులు రోజురోజుకి పెరుగుతుండటంతో.... యానాం మర్చంట్ అసోసియేషన్ కరోనా ఆసుపత్రికి తమ సంస్థ నిధుల నుంచి లక్షా 70 వేలతో 5 జంబో ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. మూడు కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న 200 మందికి డ్రైఫ్రూట్స్​ను పంపిణీ చేశారు. వ్యాపారస్తులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details