Megastar Chiranjeevi: అల్లు రామలింగయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: చిరంజీవి - చిరు రాజమహేంద్రవరం టూర్
15:04 October 01
13:32 October 01
inaugurated bronze statue of allu ramalingaiah
సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజమహేంద్రవరంలో(megastar chiranjeevi tour in rajahmundry news) పర్యటించారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఉన్న హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించి.. అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు(inaugurated bronze statue of allu ramalingaiah news). ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. అల్లు రామలింగయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అల్లు రామలింగయ్య, తనది గురుశిష్యుల అనుబంధమని చెప్పారు. రాజమహేంద్రవరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ఆయన.. నటుడిగా జన్మించింది రాజమహేంద్రవరం గడ్డమీదే అని గుర్తు చేశారు.
'మా ఇద్దరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. సినిమాల్లో ఆయన హాస్యాన్ని పండించారు. కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం జీవితాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, హోమియోపతి.. ఇలా ఎన్నో గొప్ప విషయాల గురించి ఆయన నాతో చెప్పేవారు. ముఖ్యంగా హోమియోపతి గురించి ఆయన నాకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ హోమియోపతి మీద ఉన్న ఆసక్తితో అందులో శిక్షణ తీసుకుని ఆర్‌ఎంపీ పట్టా పొందారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిత్యవిద్యార్థి. అలాగే, ఆయన ఏదైనా అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. చిన్న ఊరిలో జన్మించినా.. సినిమా పరిశ్రమలోకి వచ్చి హాస్యనటుడిగా అనుకున్నది సాధించి పద్మశ్రీ పొందారంటే ఆయన పట్టుదల ఆషామాషీ కాదు. ఆయన నాకు ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత. నటుడిగా నా ప్రయాణం మొదలైంది రాజమండ్రి గడ్డమీదనే. ‘పునాదిరాళ్లు’తోపాటు చాలా సినిమా షూటింగులు ఈ జిల్లాలోనే జరిగాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి అల్లు రామలింగయ్య గారిని కలిశాను. అప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు నన్ను తన అల్లుడిగా చేసుకోవాలని. అలా మా ఇద్దరి మధ్య ఎంతో చక్కని అనుబంధం ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మేము హోమియోపతి మందులనే ఎక్కువగా వాడుతుంటాం’ - చిరంజీవి, సినీ నటుడు
ఇదీ చదవండి
Badvel by poll: ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ: సీఈవో విజయానంద్