పేదల నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో సమావేశం నిర్వహించిన ఆయన... పేదలకు ఇచ్చే లే అవుట్ స్థలాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనులను గురించి వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులు హాజరయ్యారు.
'స్థలాల ఎంపిక త్వరలో పూర్తి కావాలి' - latest news of east godavari dst collector
ప్రభుత్వం నిరుపేదలకు ఆశ్రయం కల్పించేందుకు ఉద్దేశించిన నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియ అతి త్వరలో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.. అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఆయన డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
నివేశిన స్థలల అంశంపై జిల్లాలో సమీక్ష