తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో.. పోలవరం నిర్వాసితుల గృహ నిర్మాణాలపై సమీక్ష జరిగింది. వీటి నిమిత్తం టెండర్లను పొడిగిస్తామని... ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆనంద్ తెలిపారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
కాలనీలకు సమీపంలోనే భూమికి భూమి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చెప్పారు. ఈ సమావేశంలో రంపచోడవరం సబ్ కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, చింతూరు ఐటీడీఏ పీవో వెంకటరమణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.