'యుద్ధ ప్రాతిపదికన భూ సమీకరణ పూర్తి చేయండి' - cm camp office
తూర్పుగోదావరి జిల్లా తునిలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అధికారులతో సమీక్షించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించిన ఆయన తునిలో భూ సమీకరణ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వార్డు వాలంటీర్లు, కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తునిలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమావేశం