కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించేందుకు ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో నిపుణుల కమిటీ త్వరలో భేటీ కానుంది. ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో దెబ్బతిన్న డయాఫ్రామ్ ప్రాంతాన్ని వర్చువల్ విధానంలో పరిశీలించనుంది. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు గానూ ఏం చేయాలన్న దానిపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర జలశక్తి శాఖ కోరటంతో ఈ నిపుణుల కమిటీ బృందం అధ్యయనం చేయనుంది. దీంతో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2 లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంపైనా చర్చించనున్నారు. జర్మనీకి చెందిన బావర్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర జలసంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులు కూడా దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నారు.
Polavaram: పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లపై చర్చించేందుకు నిపుణుల కమిటీ
కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించేందుకు నిపుణుల కమిటీ త్వరలో భేటీ కానుంది. ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో దెబ్బతిన్న డయాఫ్రామ్ ప్రాంతాన్ని వర్చువల్ విధానంలో పరిశీలించనుంది.
పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లపై చర్చించేందుకు నిపుణుల కమిటీ
TAGGED:
Polavaram Project Designs