అందరూ సేవా దృక్పథంతో ఉండాలని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను విశ్వరూప్ పంపిణీ చేశారు. 55 మంది దివ్యాంగులకు ఆరు లక్షల రూపాయలు విలువచేసే కృత్రిమ అవయవాలను మంత్రి అందించారు.
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్ - దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్ వార్తలు
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో సమాజానికి సేవలు అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను మంత్రి విశ్వరూప్ పంపిణీ చేశారు.
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి విశ్వరూప్ నివాళులర్పించారు. మీనాక్షి ఫౌండేషన్ ఛైర్మన్ పి. శ్రీకాంత్, మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మాడుగులలో కింగ్ కోబ్రా కలకలం
TAGGED:
మీనాక్షి ఫౌండేషన్ వార్తలు