ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య శాఖ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా వైద్యులు, సిబ్బంది నిరసన - Staff protest against the attitude of Medical Commissioner

రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నాగుల్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేపట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మాట్లాడిన తీరు పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Staff protest against the attitude of Medical Commissioner
Staff protest against the attitude of Medical Commissioner

By

Published : May 19, 2021, 5:04 PM IST

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తమను కించపరిచే విధంగా మాట్లాడారంటూ వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం నాగుల్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కష్టపడి విధులు నిర్వర్తిస్తున్న తన మనోధైర్యం దెబ్బతీసే విధంగా కమిషనర్ మాట్లాడటం బాధాకరం అన్నారు. ఈ నిరసనలో వైద్యాధికారులు వై. శ్రీవల్లి, కే సుబ్బరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details