తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాలగా పనిచేస్తుందని తెలిపారు. కళాశాల ఏర్పాటుకు స్థలం అందుబాటులో ఉందని... చాలకపోతే రాజానగరం మండలంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందనీ చెప్పారు.
'ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు' - రాజమహేంద్రవరంలో ప్రభుత్వం వైద్య కళాశాల
రాజమహేంద్రవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు అవుతుందన్నారు.
!['ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు' Jakkampudi_Raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7128156-506-7128156-1589025482085.jpg)
Jakkampudi_Raja
కోరుకొండలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి గతంలో రెండు మూడు సార్లు వరదనీటిలో మునిగిందని... ఈ అంశం ప్రస్తుతం సీఎం దగ్గర ఉందని చెప్పారు. ఈ సమస్యపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
TAGGED:
jakkampudi raja latest news